కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకునేందుకు హైదరాబాద్ వాసులు సిద్దమవుతున్నారు. వైన్ షాపులు కిటకిటలాడనుండగా.. పబ్బులు, బార్లు మందుబాబులతో నిండనున్నాయి.న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. సొంత వెహికల్ లేనివారు లేదా మద్యం తాగినవారు క్యాబ్ లేదా ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

కఠిన చర్యలు
నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు.వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్‌ను హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 9490616555 కు పంపించాలని సూచించారు. వెంటనే పోలీస్ సిబ్బంది స్పందించి నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేశారని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: