వాల్నట్స్ (Walnuts)ఆరోగ్యానికి, ముఖ్యంగా మెదడు పనితీరుకు ఎంతో ఉపయోగకరమైన డ్రై ఫ్రూట్‌గా గుర్తింపు పొందాయి. వీటిలో అవసరమైన సూక్ష్మ పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.

నిత్యం వాల్నట్స్(Walnuts) తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. మెదడు సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, కొన్ని రకాల క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకునే గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి కూడా ఇవి మంచి ఎంపికగా నిలుస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: