ఆంధ్రప్రదేశ్(AP Govt) రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న పేద విద్యార్థినుల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థినుల రోజువారీ అవసరాలు, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని ఒక్కో విద్యార్థినికి పది నెలల పాటు నెలకు రూ.1000 చొప్పున కాస్మోటిక్స్ ఖర్చుల కోసం నగదు సహాయం అందించనుంది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థినుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
Read Also: AP NewDistricts: పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు

పరీక్షల సమయంలో రవాణా ఖర్చుల భారం తగ్గింపు
అదనంగా, పరీక్షలకు(AP Govt) హాజరయ్యే విద్యార్థినులు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు రవాణా ఖర్చుల కింద ఒక్కో విద్యార్థినికి రూ.350 ముందుగానే చెల్లించనున్నారు. ఈ చర్యతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.
నిధులు విడుదల – త్వరలో ఖాతాల్లో జమ
ఈ పథకాల అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. త్వరలోనే అర్హులైన విద్యార్థినుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుందని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. బాలికల విద్యను ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాప్అవుట్లను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: