ప్రజలు తమ ఆదాయాన్ని భద్రంగా పొదుపు చేసుకోవడంతో పాటు రిస్క్ నుంచి రక్షణ పొందేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు పలు పథకాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఏఐజీ మరియు బజాజ్ అలియాంజ్ సంస్థల సహకారంతో ప్రత్యేకంగా రూపొందించిన ‘వ్యక్తిగత ప్రమాద బీమా పథకం’ను(Insurance Scheme) ప్రవేశపెట్టింది.
Read Also: Indian Railway: రైల్‌వన్ యాప్‌లో జనరల్ టికెట్లపై డిస్కౌంట్

ఈ పాలసీ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ బీమా రక్షణ లభిస్తుంది. ఏటా కేవలం రూ.755 ప్రీమియం చెల్లిస్తే గరిష్టంగా రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ పొందవచ్చు. ఈ పథకానికి 16 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులు.
డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు అనుకూల పథకం
రోజువారీ ప్రయాణాలు చేసే వాహన డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు, గిగ్ వర్కర్లకు ఈ బీమా(Insurance Scheme) పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకోని ప్రమాదాల సమయంలో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని సమీప పోస్టాఫీసులో సులభంగా తీసుకోవచ్చు. అలాగే ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: