Hyderabad new burj : హైదరాబాద్ నగరానికి మరో కొత్త గుర్తింపు చిహ్నం చేరబోతోంది. మాసబ్‌ట్యాంక్ వద్ద నిర్మించిన కొత్త బుర్జ్ (వాచ్‌టవర్ / బాష్టియన్) త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జీహెచ్‌ఎంసీ కోసం డెక్కన్ టెర్రెయిన్ హెరిటేజ్ సంస్థ ఈ బుర్జ్‌ను రూపకల్పన చేసి నిర్మించింది. ప్రాచీన డెక్కన్ శిల్పకళను ఆధునిక డిజైన్‌తో మేళవిస్తూ ఈ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ బుర్జ్‌ను షట్కోణ (హెక్సాగనల్) ఆకృతిలో నిర్మించారు. అడుగుభాగంలో ప్రతి వైపు 10 అడుగుల వెడల్పుతో ప్రారంభమై, పైకి వెళ్తూ 20 అడుగుల ఎత్తుకు తగ్గుతూ ఉంటుంది. పైభాగంలో మూడు వైపులా చైమింగ్ టవర్ క్లాక్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ గార్డెన్స్ గేట్, టోలిచౌకి లోని యూసఫ్ టెక్రీల నుంచి ప్రేరణ పొంది ఈ పారపెట్ డిజైన్ రూపొందించారు.
Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
చున్నపు మోర్టార్, కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ (Hyderabad new burj) ఎర్త్ బ్లాక్స్‌తో ఈ బుర్జ్‌ను నిర్మించారు. 14 అడుగుల ఎత్తులో మద్రాస్ టెర్రస్ రూఫ్, ఆర్చ్ ఆకారంలోని తలుపులు, కిటికీలు సహజ గాలి ప్రవాహానికి అనుకూలంగా ఉన్నాయి. ఇది కేవలం నిర్మాణమే కాకుండా, నగర వారసత్వాన్ని గుర్తు చేసే చిహ్నంగా నిలవనుంది.
డెక్కన్ టెర్రెయిన్ హెరిటేజ్ చీఫ్ కన్సర్వేటర్ మీర్ ఖాన్ మాట్లాడుతూ, “1869 నుంచి 2025 వరకు 157 ఏళ్ల మున్సిపల్ పరిపాలన సేవలకు గుర్తుగా ఈ బుర్జ్‌ను ల్యాండ్‌మార్క్‌గా రూపొందించాం. సంప్రదాయ కళ, శిల్పం, డెక్కన్ వాస్తు శైలిని ఆధునిక పట్టణ దృశ్యంలోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: