
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్(Tiger Reserve)కు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడవిని దాటి గ్రామంలోకి ప్రవేశించిన ఓ పులి గ్రామస్థుల్లో భయాందోళన సృష్టించింది. ఒక యువకుడిపై దాడి చేయడమే కాకుండా, ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడి మంచంపై కూర్చోవడంతో గ్రామం అంతా గడగడలాడింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో గ్రామస్థులు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గంటల తరబడి ఆశ్రయం పొందారు.
Read Also: Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి
పాన్‌పథా బఫర్ జోన్ నుంచి బయలుదేరిన పులి
ఉదయం 10 గంటల సమయంలో పాన్‌పథా బఫర్ జోన్ నుంచి బయలుదేరిన పులి మొదట గ్రామ పరిసరాల్లోని పంట పొలాల్లో దర్శనమిచ్చింది. అటవీశాఖ(Forest Department)కు సమాచారం చేరేలోపే మధ్యాహ్నానికి అది గ్రామంలోకి ప్రవేశించింది. గ్రామస్థులు కర్రలతో పులిని అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నించగా, అకస్మాత్తుగా అది గోపాల్ కోల్ అనే యువకుడిపై దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడి కాలు తీవ్రంగా గాయపడింది. అతడిని తొలుత బర్హీ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కట్నీకి తరలించారు.

దాడి అనంతరం పులి దుర్గా ప్రసాద్ ద్వివేది ఇంట్లోకి వెళ్లి అక్కడి మంచంపై కూర్చుండటంతో భయం మరింత పెరిగింది. సమాచారం అందుకున్న పాన్‌పథా బఫర్ జోన్ రెస్క్యూ బృందం, వెటర్నరీ వైద్యులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టింది. సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించి పులికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకుని, ఆపై సురక్షితంగా అడవిలోకి తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: