వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని టీటీడీ చైర్మన్ శాలువాతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
Read also: New Vehicles : కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

TTD
మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ఈ దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినంలో శ్రీవారిని దర్శించుకుంటే శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. ఆ తరువాత ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: