India head coach : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న **గౌతమ్ గంభీర్**ను తొలగించే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది. ఇటీవల టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసినప్పటికీ, గంభీర్‌పై నమ్మకం కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టంచేసింది.
జూలై 2024లో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో గంభీర్ టీమిండియా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేతృత్వంలో ఇప్పటివరకు భారత్ 19 టెస్టులు ఆడగా, కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్, ఇంగ్లండ్‌లో రెండు టెస్టులు గెలిచినా, స్వదేశంలో న్యూజిలాండ్‌పై 0-3, దక్షిణాఫ్రికాపై 0-2తో ఘోర పరాజయాలు ఎదురయ్యాయి.
గంభీర్ కోచింగ్‌లో భారత్ స్వదేశంలో ఐదు టెస్టులు ఓడిపోవడం చరిత్రలోనే తొలిసారి. అలాగే, హోమ్ సిరీస్‌లో రెండుసార్లు వైట్‌వాష్ అయిన ఏకైక భారత కోచ్‌గా కూడా ఆయన నిలిచారు. దీంతో టెస్టు ఫార్మాట్ నుంచి గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ వార్తలను ఖండించారు. (India head coach)
“గౌతమ్ గంభీర్‌ను తొలగించే ఆలోచన లేదు. కొత్త హెడ్ కోచ్ నియామకం కూడా జరగదు,” అని ఆయన స్పష్టం చేశారు.
గంభీర్ ఒప్పందం నవంబర్ 2027 వరకు కొనసాగనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో శ్రీలంకతో టెస్టు సిరీస్, అనంతరం న్యూజిలాండ్ పర్యటన, 2027లో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్‌కు కీలకంగా మారనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 గెలవాల్సిన పరిస్థితి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: