రోజూ వంట చేసే సమయంలో చిన్న చిట్కాలు(Kitchen Tips) తెలుసుకుంటే పని సులభమవడమే కాకుండా, వంటల రుచి, రూపం కూడా మెరుగవుతుంది. వంటింట్లో తప్పక ఉపయోగపడే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ ఇవి.

రుచికరమైన వంట కోసం సులభ చిట్కాలు
- గారెలు మంచి బంగారు రంగులో రావాలంటే(Kitchen Tips) వేయించే నూనెలో కొద్దిగా చింతపండు ముక్క వేసితే సరిపోతుంది.
- క్యాలీఫ్లవర్ ఉడికించే సమయంలో కొంచెం పాలు కలిపితే కూర సహజ రంగు మారకుండా ఉంటుంది.
- ఉల్లిపాయలు తరిగేటప్పుడు చేతులకు స్వల్పంగా వెనిగర్ రాసుకుంటే వాసన అంటదు.
- కొబ్బరి పాలు తీయాలంటే గోరువెచ్చని నీరు వాడితే పాలు ఎక్కువగా, సులువుగా వస్తాయి.
- చపాతీ పిండి ఎండిపోకుండా ఉండాలంటే దానిపై తడి గుడ్డతో కప్పాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: