हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Thalapathy Vijay: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కింద పడిపోయిన విజయ్

Aanusha
Due to the overenthusiasm of the fans, Vijay fell down
Due to the overenthusiasm of the fans, Vijay fell down

తమిళ చిత్రసీమలో దళపతి విజయ్ ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న విజయ్ (Thalapathy Vijay), తన చివరి సినిమాగా ప్రకటించిన ‘జన నాయగన్’తో మరోసారి రికార్డు స్థాయి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్‌నే ఇందుకు నిదర్శనం. మలేషియాలో ఓపెన్ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమం నిజంగా ఒక సినిమా పండుగను తలపించింది. లక్షలాది మంది అభిమానులు హాజరుకాగా, భారీ స్టేజ్ సెటప్, ఇంటర్నేషనల్ స్థాయి లైటింగ్, సౌండ్ డిజైన్ ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా నిలిపాయి.

Read Also: Tollywood: ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు

కారు ఎక్కుతుండ‌గా, ఒక్క‌సారిగా స్లిప్ అయి ప‌డిపోయాడు

మ‌లేషియా నుండి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న స‌మ‌యంలో ఆయ‌న కోసం భారీ ఎత్తున అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. అభిమానులు ఒక్క‌సారిగా విజ‌య్‌ (Thalapathy Vijay) ని చుట్టుముట్ట‌డం, ఆ గంద‌ర‌గోళంలో కారు ఎక్కుతుండ‌గా, ఒక్క‌సారిగా స్లిప్ అయి ప‌డిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ ఘ‌ట‌న‌లో విజ‌య్‌కి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రు ఊపిరి పీల్చుకున్నారు.

విజ‌య్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదిలా ఉండగా, డిసెంబర్ 27న కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియంలో జరిగిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు దాదాపు లక్ష మంది హాజరయ్యారు. అత్యధిక ప్రేక్షకులు పాల్గొన్న ఆడియో లాంచ్‌గా ఇది మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. శ్రీలంక తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద తమిళ ప్రవాసుల జనాభా మలేషియాలో ఉండటం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870