Netanyahu Iran conflict : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత మూడు దశాబ్దాలుగా ఇరాన్ నుంచి తీవ్ర ముప్పు ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ హెచ్చరికలను గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పరిగణలోకి తీసుకుని, జూన్‌లో తేహ్రాన్‌లోని అణు కేంద్రాలపై దాడులకు ఆదేశించారు. అయితే, ఆ చర్యలతో కూడా నెతన్యాహు పూర్తిగా సంతృప్తి చెందలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ట్రంప్‌ను కలవడానికి అమెరికా వెళ్లనున్న నెతన్యాహు, ఇరాన్‌పై మరింత సైనిక చర్యల కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఈసారి ఆయన దృష్టి ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌పై కేంద్రీకృతమైందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్ నేతలు మరియు వారి అమెరికన్ మిత్రులు మరోసారి ఇరాన్‌పై యుద్ధ డంకా మోగిస్తున్నారు. తేహ్రాన్ మిసైల్ సామర్థ్యాన్ని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని వారు వాదిస్తున్నారు. అయితే, ఇది ట్రంప్ ప్రకటించిన విదేశాంగ విధాన ప్రాధాన్యతలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: SIR: ఉత్తర్ ప్రదేశ్ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?
సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ పాలసీకి చెందిన (Netanyahu Iran conflict) సీనియర్ ఫెలో సినా టూసీ మాట్లాడుతూ, ట్రంప్ ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారం, దౌత్య సంబంధాలపై దృష్టి పెడుతుంటే, నెతన్యాహు మాత్రం ప్రాంతీయ సైనిక ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇది అమెరికా ప్రయోజనాలతో ఢీకొనే పరిస్థితికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, ఆ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తరచుగా ఉల్లంఘిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య ట్రంప్ తాను మధ్యప్రాచ్యంలో 3,000 సంవత్సరాల తర్వాత తొలిసారి శాంతిని తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారు. అమెరికా తాజా జాతీయ భద్రతా వ్యూహంలో కూడా, మధ్యప్రాచ్యం ఇకపై అమెరికాకు ప్రధాన సైనిక ప్రాధాన్యత కాదని పేర్కొన్నారు.
అయితే, అమెరికా తన సైనిక ఉనికిని తగ్గించాలనుకుంటున్న సమయంలో, ఇజ్రాయెల్ మాత్రం వాషింగ్టన్‌ను మరో యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని ప్రధాన ముప్పుగా చూపిన ఇజ్రాయెల్, ఇప్పుడు ట్రంప్ ఆ సమస్యను పరిష్కరించానని చెప్పడంతో, మిసైల్ అంశాన్ని కొత్త కారణంగా ముందుకు తెస్తోందని అంటున్నారు.
క్విన్సీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ట్రిటా పార్సీ మాట్లాడుతూ, “ట్రంప్ అణు అంశం ముగిసిందని ప్రకటించిన తర్వాత, ఇజ్రాయెల్ ఒత్తిడిని కొనసాగించేందుకు లక్ష్యాన్ని మార్చుతోంది. ఇరాన్‌తో పోరును అంతులేని యుద్ధంగా మార్చాలన్నదే నెతన్యాహు లక్ష్యం” అని వ్యాఖ్యానించారు.
ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం శాంతియుతమేనని ఎప్పటికప్పుడు చెబుతోంది. ఇజ్రాయెల్ వద్ద ప్రకటించని అణు ఆయుధాలు ఉన్నాయన్న అభిప్రాయం అంతర్జాతీయంగా ఉన్నప్పటికీ, ఆ విషయంపై అధికారిక అంగీకారం లేదు. జూన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ముందుగా దాడి చేయడంతోనే తాము ప్రతిస్పందించామని ఇరాన్ వాదిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ మద్దతుదారులు, ముఖ్యంగా AIPAC, ఇరాన్ మిసైల్ సామర్థ్యం ఇంకా ప్రమాదకరంగానే ఉందని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ అంచనా ప్రకారం, ఇరాన్ వద్ద ఇప్పటికీ సుమారు 1,500 బాలిస్టిక్ మిసైళ్లు మిగిలి ఉన్నాయని వారు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: