రాజధాని ఢిల్లీ(Delhi Metro) ఎదుర్కొంటున్న తీవ్రమైన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం మెట్రో రవాణాను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి నెలా ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తోంది. ఈ క్రమంలో మెట్రో నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడమే కాకుండా, కొత్త తరహా సౌకర్యాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
Read also: Assembly Session : అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారా ?

ధనిక వర్గానికీ మెట్రో ఆకర్షణగా మారేలా లగ్జరీ సౌకర్యాలు
కారు ప్రయాణాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇప్పటివరకు మెట్రోను పెద్దగా ఉపయోగించని ధనిక వర్గాన్ని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ఆరు బోగీలతో నడిచే మెట్రో రైళ్లకు ఒక ప్రత్యేక లగ్జరీ కోచ్‌ను జోడించనున్నారు. ఈ కోచ్‌లో అధునాతన సీటింగ్, మెరుగైన సౌకర్యాలు ఉండనున్నాయి. అలాగే మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులను వారి ఇళ్లకు చేర్చేందుకు లగ్జరీ క్యాబ్ సేవలను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ అదనపు సౌకర్యాల కోసం ప్రయాణికుల నుంచి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఆ ద్వారా వచ్చే ఆదాయాన్ని సాధారణ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వినియోగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం లజ్‌పత్ నగర్‌లోని(Lajpat Nagar) నెహ్రూ నగర్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర ఇంధన, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఈ విషయాలను వెల్లడించారు.
ట్రాఫిక్ తగ్గితే కాలుష్యంపై ప్రభావం
ఈ చర్యల వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి, ట్రాఫిక్ రద్దీతో పాటు వాయు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోను(Delhi Metro) రోజుకు సుమారు 35 లక్షల మంది ఉపయోగిస్తుండగా, మొత్తం రోజువారీ ప్రయాణాలు 65 లక్షల వరకు ఉంటున్నాయి. మెట్రో లేకపోతే ఢిల్లీ కాలుష్య పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వేగంగా విస్తరిస్తున్న మెట్రో నెట్‌వర్క్
ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో 400 కిలోమీటర్లకు పైగా మెట్రో లైన్లు పనిచేస్తున్నాయి. ఒకే నగర ప్రాంతంలో అత్యధిక మెట్రో లైన్ల పరంగా త్వరలో చికాగోను అధిగమించే స్థాయికి చేరుకుంటామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,100 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ ఉండగా, మరో 800 కిలోమీటర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో భారత్ ముందంజలో నిలుస్తుందని ఆయన చెప్పారు.
ఢిల్లీ మెట్రోలో ఏ కొత్త సౌకర్యాలు రాబోతున్నాయి?
A: లగ్జరీ కోచ్, లగ్జరీ క్యాబ్ సేవలు.
ఈ సౌకర్యాల లక్ష్యం ఏమిటి?
ధనిక వర్గాన్ని మెట్రో వైపు ఆకర్షించి కాలుష్యాన్ని తగ్గించడం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: