దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు (Gig worker) నూతన సంవత్సర వేడుకల రోజైన డిసెంబర్ 31న భారీ సమ్మెకు సిద్ధమయ్యారు. తమ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం కోరుతూ, ఈ మెగా స్ట్రైక్‌కు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వంటి కార్మిక సంఘాలు నాయకత్వం వహిస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ యాప్ సంస్థల డెలివరీ భాగస్వాములు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.
Read also: coimbatore crime: ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

Swiggy
క్రిస్మస్ ఫ్లాష్ స్ట్రైక్‌తో మొదలైన ప్రభావం
డిసెంబర్ 31 సమ్మెకు ముందు, డిసెంబర్ 25న గిగ్ వర్కర్లు పలు నగరాల్లో ఫ్లాష్ స్ట్రైక్ నిర్వహించారు. గురుగ్రామ్‌లో ఫుడ్ డెలివరీ సేవలు గణనీయంగా తగ్గగా, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో వేలాదిమంది కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాప్ ఆధారిత కంపెనీల షేర్లపై స్వల్ప ఒత్తిడి కనిపించింది. ఫ్లాష్ స్ట్రైక్ అనేది ఒక నిర్దిష్ట సమయంలో కార్మికులు యాప్‌ల నుంచి లాగ్ అవుట్ అయి సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం అని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు.
10 నిమిషాల డెలివరీ రద్దే ప్రధాన డిమాండ్
కార్మికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న 10 నిమిషాల డెలివరీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 4 కిలోమీటర్ల పరిధిలో ప్రతి డెలివరీకి కనీసం రూ.35 చెల్లించాలి, రైడ్ సేవలకు కిలోమీటర్‌కు కనీసం రూ.20 ఇవ్వాలని కోరుతున్నారు. సరైన కారణం లేకుండా ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిలిపివేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక భద్రత కోడ్ అమలులోకి రావాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: