లండన్ జాబ్ పేరుతో ఏపీ మహిళకు భారీ మోసం
ఆంధ్రప్రదేశ్(AP crime)లోని కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన ఓ మహిళకు విదేశీ ఉద్యోగం పేరిట మోసం జరిగింది. లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన మైఖేల్ విన్సెంట్ అనే వ్యక్తి ఆమెను నమ్మించి మోసానికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్(Instagram Scam) ద్వారా పరిచయమైన అతడు తనను ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్గా పరిచయం చేసుకొని, నకిలీ ఇంటర్వ్యూ ప్రక్రియలు నిర్వహించాడు.
Read also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

నకిలీ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ వలలో తాడిగడప మహిళ
అంతేకాకుండా ప్రభుత్వ వెబ్సైట్లను తలపించే విధంగా తయారు చేసిన ఫేక్ ఈమెయిళ్లను పంపిస్తూ విశ్వాసం కలిగించాడు. చివరకు వీసా, ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో 7,500 పౌండ్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతో మహిళకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి ఆఫర్లను నమ్మేముందు అధికారిక ధృవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: