(RRB 2025) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎన్టీపీసీ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB 2025) మరో కీలక అప్డేట్ జారీ చేసింది. ఇటీవల సీబీటీ 2 పరీక్ష ఫలితాలు వెల్లడించిన ఆర్ఆర్బీ.. మరో రెండు రోజుల్లో కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST) పరీక్షలను నిర్వహించనుంది.
Read Also: Bengal Hotels: బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

అడ్మిట్ కార్డులు విడుదల
ఈ క్రమంలో, సీబీటీ 2 పరీక్షలో అర్హత సాధించిన 43,957 మంది అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST) పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఈ నెల 28న నిర్వహించనున్నారు. మరోవైపు, జనవరి 4న జరగనున్న XAT 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విడుదల చేసింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: