బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన ఒక్క ప్రెస్‌మీట్‌నే రేవంత్ రెడ్డిని కలవరపెట్టిందని, అలాంటి కేసీఆర్ అసెంబ్లీకి(TG Politics) వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత దోసల అనిల్ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Also: Karimnagar: పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌పై ఆగ్రహం
తన తండ్రి కేసీఆర్ తెలంగాణ సాధించిన నాయకుడని గర్వంగా చెప్పుకుంటానని కేటీఆర్ అన్నారు. తాను గుంటూరులో చదివితే రేవంత్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజకీయ హోదాకు తగిన భాష కావాలని సూచించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కల్యాణలక్ష్మి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీలపై ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. హామీల గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి అనుచిత భాష వాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో పోరాటానికి సిద్ధం
రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యత బీఆర్ఎస్‌దేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కావాలని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని కేసీఆర్ అడగడం సముచితమేనని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: