పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు. వారికోసం రాత్రీపగలు కష్టపడతారు. వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తారు. సమాజానికి ఆదర్శంగా జీవించాలని తపిస్తారు. చదువుకునేందుకు అన్ని సదుపాయాలను కల్పిస్తారు. అసలు వారికి కష్టం అనేది తెలియకుండా పెంచేందుకు యత్నిస్తారు. అలాంటి పిల్లలు ఎదిగిన తర్వాత తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తే ఆ తల్లిదండ్రుల మనసు సమ్మతించదు. తాజాగా ఓ బాలిక పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని, స్వయంగా అమ్మానాన్నలే తమ కూతురుని హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Read also: UP Crime: భార్యపై అనుమానంతో భర్త హత్య, మృతదేహం ఇంట్లో దాచిన ఘటన

Karimnagar crime
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం…శివరాంపల్లికి చెందిన ఓ దంపతుల చిన్న కూతురు (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ వయసులో కెరీర్ను పదునుపెట్టుకోవాల్సిన వయసులో ప్రేమవైపు ఆ బాలిక మనసు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన పెళ్లైన ఓ యువకుడితో బాలిక ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నది. దీంతో తల్లిదండ్రులు బాలికను పద్ధతి మార్చుకొమ్మని హెచ్చరించారు.
మాట వినకపోవడంతోనే హత్య
అయితే బాలిక తన తల్లిదండ్రుల మాటలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. దీంతో విసుగు చెందిన అమ్మానాన్నలు తమ కూతురుని హతమార్చారు. నవంబరు 14వ తేదీన బాలిక నిద్రిస్తున్న సమయంలో పురుగుమందును (pristicide) తమ కుమార్తెకు బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించారు. అంతేకాగా తండ్రి బాలిక గొంతు నులిమి హతమార్చారు. ఇందుకు తల్లి కూడా సహకరించింది. ఉదయం ఏమీ ఎరుగనట్లుగా బాలిక తండ్రి రాజు తమ కుమార్తె పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో బాలిక గొంతు నులమడంతోనే మరణించినట్లు తేలింది. యువకుడితో కూతురు ప్రేమను గిట్టని తల్లిదండ్రులే దారుణానికి ఒడిగట్టారు. ఇది పరువు హత్య అని ఏసీపీ స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో తామే కూతురుని చంపినట్లుగా అంగీకరించినట్లు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: