TG: క్రిస్మస్ పండుగతో పాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్(traffic) నిలిచిపోయింది. ముఖ్యంగా చిట్యాల సమీపంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు, ఫ్లైఓవర్ నిర్మాణం నెమ్మదిగా సాగడంతో వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి.
Read also: Telangana: కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

అలాగే చౌటుప్పల్, పంతంగి టోల్ గేట్ల వద్ద వాహనాలు పొడవైన క్యూలలో నిలవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి కదలిక లేకపోవడంతో ప్రయాణ సమయం రెట్టింపు అవుతోంది. ప్రయాణికులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం కూడా ఇబ్బందులు పెంచుతోంది.
పరిస్థితిని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సిబ్బంది సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించడం, టోల్ గేట్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, పండుగల సీజన్లో ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: