గతకొన్ని రోజులుగా నైజీరియాలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. వారిపై ఊచకోతకు దిగుతున్న టెర్రిస్టుల ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయి. కరుడుకట్టిన ఐసిస్ ఉగ్రవాదులు క్రైస్తవుల నివాస గ్రామాలపై పడి, వారిని సామూహికంగా హతమారుస్తూ వస్తున్నది. దీనిపై ప్రపంచదేశాలు ఈ ఆగడాలను అరికట్టాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. దీంతో నైజీరియా వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా భారీ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump) ప్రకటించారు. ‘నిరపరాధ క్రైస్తవులను దారుణంగా హతమార్చుతున్న ఐసిస్ ఉగ్రవాదులపై శక్తివంతమైన, ప్రాణాంతక దాడులు నిర్వహించాం’ అని ట్రంప్ తెలిపారు. అయితే క్రిస్మస్ వేళ ఈ దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read Also: Pakistan Terrorism: వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు
ఉగ్రవాదులపై ఖచ్చితమైన దాడులు
కమాండర్ ఇన్ చీఫ్ గా నా ఆదేశాల మేరకు నైజీరియా వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం ఖచ్చితమైన దాడులు చేసిందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ప్రధానంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు ఇది తమ ప్రతిస్పందన అని తెలిపారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం ఎదగడానికి తమ పాలనలో అవకాశం ఉండని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సైన్యానికి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. చనిపోయినా ఉగ్రవాదులకు కూడా మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
దాడులను ధ్రువీకరించిన ఆఫ్రికా కమాండ్
నైజీరియాలో ఉగ్రవాదులపై అమెరికా(Trump) సైన్యం దాడులను యుఎస్ ఆఫ్రికా కమాండ్ కూడా ధ్రువీకరించింది. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు దాడులు నిర్వహించామని వెల్లడించింది. తమ దాడిలో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించింది. అయితే తమ దేశంలోని భద్రతా సమస్యలు మతపరమైన కోణానికి మాత్రమే పరిమితం కావని నైజీరియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముస్లింలు, క్రైస్తవులు రెండు మతాల వారిపైనా దాడులు జరుగుతున్నాయని తెలిపింది. క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలు తమ దేశంలోని పరిస్థితులకు సరిపోవని తెలిపింది. కానీ ఉగ్రవాదులు పలుసందర్భాల్లో క్రైస్తవులనే టార్గెట్ గా చేసుకుని, హతమారుస్తూ ఉంది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు, వారి భూముల సంపదను కొల్లగిడుతూ వచ్చింది. దీంతో నిత్యం క్రైస్తవులు, ముస్లింల మధ్య తగాదాలు జరుగుతూనే ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: