ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్(Kim Jong) ఉన్ నిత్యం తనదైనశైలిలో మీడియాలో ప్రతక్ష్యమవుతుంటారు. తాజాగా ఆయన తన కుమార్తెతో కలిసి జలాంతర్గామిని పరిశీలించారు. దీంతో తన అణుశక్తి ఆయుధ సంపత్తిని మరింతగా పెంచుకునేందుకు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇతర దేశాలతో ఏమాత్రం తీసిపోకుండా తన దేశ రక్షణ కోసం అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. అంతేకాక వాటిపై ప్రయోగాలు, పరీక్షలు చేస్తూ, అతిపెద్దదేశాల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తున్నారు. (North Korea) అమెరికా, ఐక్యరాజ్యసమితి వంటివి కిమ్ ను ఎంతో హెచ్చరిస్తున్నా వాటిని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. తాజాగా వచ్చే ఐదేళ్లలో మరిన్ని క్షిపణి వ్యవస్థలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సంబంధిత అధికారులకు కిమ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గత కొంతకాలంగా తమ ఆయుధ కర్మాగారాలను వరుసగా సందర్శిస్తూ ఆయుధ సంపత్తి వివరాలను ఆరా తీస్తోన్న కిమ్ కిపణుల తయారీని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది.
Read also: Pakistan Terrorism: వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

కొత్త ఆయుధ కర్మాగారాల నిర్మాణాలు
ఇందుకోసం కిమ్ కొత్త ఆయుధ సామర్థ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని కిమ్ పేర్కొన్నట్లుగా మీడియా తెలిపింది. (North Korea) కొత్త ఆయుధ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు కిమ్ జారీ చేసినట్లు పేర్కొంది. కిమ్ తరచూ సముద్రం ప్రాంతాల్లోను, సరిహద్దుల్లోనూ అణుశక్తి ఆయుధ పరీక్షలు జరిపారు. తాజాగా సముద్రం అడుగు నుంచి ప్రయోగించే రహస్య ఆయుధాల గురించి కిమ్ సమీక్ష జరిపారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కిమ్ గురువారం తన కుమార్తెతో కలిసి పరిశీలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com