విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ధ్రువపత్రాలు, స్కాలర్ షిప్ లు వంటి వాటికి ఆధార్ కార్డు చాలా ముఖ్యం. చిన్నతనంలో ఆధార్ కార్డు తీసుకున్నా, ఐదేళ్లు దాటిన పిల్లలు, అలాగే 15 ఏళ్లలోపు ఒకసారి తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి. ఈ విషయంలో నిరక్ష్యం చేస్తే ప్రభుత్వ సేవలు పొందడంలో ఇబ్బందులుఎదురవుతాయి. ముఖ్యంగా, ఐదేళ్లు దాటిన చిన్నారులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి. అలాగే 15 సంవత్సరాలలోపు పిల్లలు, ఎప్పటి నుంచో అప్డేట్ చేయని ఆధార్లను ఈ కేవైసీ ద్వారా అప్డేట్ చేసుకోవాలని యుఐడిఎఐ సూచించింది. పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే బాల ఆధార్లో వేలిముద్రలు, ఐరిస్ వంటివి ఉండవు. కేవలం పేరు, ఫొటో, పుట్టిన తేదీ మాత్రమే ఉంటాయి. తల్లిదండ్రుల వివరాలతో ఈ బాల ఆధార్ (Aadhaar) జారీ చేస్తారు. అయితే, పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత, వారి వేలిముద్రలు, ఐరిస్తో బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి.
Read also: YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం

Mandatory Biometric Update
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు
ఇది ఆధార్ ను ఎప్పటికప్పుడు సరిగ్గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే బాల ఆధార్లో వేలిముద్రలు, ఐరిస్ వంటివి ఉండవు. కేవలం పేరు, ఫొటో, పుట్టిన తేదీ మాత్రమే ఉంటాయి. తల్లిదండ్రుల వివరాలతో ఈ బాల ఆధార్ జారీ చేస్తారు. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత, వారి వేలిముద్రలు, ఐరిస్తో బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది ఆధార్ ను ఎప్పటికప్పుడు సరిగ్గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయించినట్లయితే, వారు ఐదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. దీనిని మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ) అని పిలుస్తారు. ఇది పిల్లలకు సంబంధించిన మొదటి బయోమెట్రిక్ అప్డేట్. ఈ ప్రక్రియలో, పిల్లల పూర్తి డేటాను మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోని చిన్నారుల
అయితే, ఈ అప్డేట్ వల్ల పిల్లల ఆధార్ నంబర్ ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ పిల్లల ఆధార్ను అప్డేట్ చేయించకపోతే, వారి ఆధార్ నంబర్ పనిచేయడం ఆగిపోతుంది (డీయాక్టివేట్ అవుతుంది). ఐదేళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్డేటు, వారి ఏడేళ్లు నిండేలోపు, అంటే రెండేళ్ల వ్యవధిలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోని చిన్నారుల సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయించుకోవడానికి సచివాలయ ఉద్యోగులను నేరుగా కలవాలి. ఈ అప్డేట్ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక ఆధార్ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాల ద్వారా కూడా పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: