ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడలో ఒకే ఒక్క సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత రుక్మిణి వసంత్ (Rukmini Vasant) కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీతో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం తారక్ సరసన నటిస్తోంది.. ఇదిలా ఉండగా, ఆమె కెరీర్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also: Google Search 2025: టాప్‌లో ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే
చరణ్ కోసం హీరోయిన్ ఎంపికపై చర్చలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాకు రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తైన తర్వాత దర్శకుడు సుకుమార్ తో చరణ్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.వీరి కాంబినేషన్ లో, గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ప్రస్తుత ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలో చరణ్ కోసం హీరోయిన్ ఎంపికపై చర్చలు జరుగుతుండగా, రుక్మిణి వసంత్ (Rukmini Vasant)పేరు బలంగా వినిపిస్తోంది. సుకుమార్ కథకు ఆమె క్యారెక్టర్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని, అందుకే ఆమెను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.ఈ వార్త నిజమైతే బ్యాక్ టు బ్యాక్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం రుక్మిణికి దక్కినట్టే. దీంతో ఆమె ఫేమ్, మార్కెట్ రెండూ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరగడం ఖాయం అని చెప్పవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: