ఉత్తరప్రదేశ్‌లోని(UP Crime) గోరఖ్‌పూర్‌లో అమానుష హత్య కేసు వెలుగులోకి వచ్చింది. భార్య రహస్యంగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తోందన్న అనుమానంతో భర్త ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి వెనుకే పూడ్చిపెట్టాడు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు.
Read Also: AP Crime: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

పోలీసుల వివరాల ప్రకారం, అర్జున్ అనే వ్యక్తి లూథియానాలో కూలీగా పని చేస్తున్నాడు. ఈ నెల 21న స్వగ్రామమైన గోరఖ్‌పూర్‌కు వచ్చాడు. అప్పట్లో భార్య ఖుష్బూ ఫోన్‌ను రహస్యంగా వాడుతున్నట్లు గమనించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో అర్జున్ ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.
మృతదేహాన్ని పూడ్చి ఆత్మహత్యగా ప్రచారం
హత్య అనంతరం ఇంటి వెనుక(UP Crime) ఆరడుగుల లోతు గల గోతిని తవ్వి, మడత మంచంతో కలిసి ఖుష్బూ మృతదేహాన్ని అందులో దాచేశాడు. ఆపై ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించాడు. రోజులు గడిచినా ఖుష్బూ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అర్జున్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తొలుత భార్య ఆత్మహత్య చేసుకుని నదిలో మృతదేహాన్ని పడేశానని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించాడు.
విచారణలో నేరం అంగీకారం
నదిలో గాలింపు ఫలితం లేకపోవడంతో పోలీసులు మళ్లీ విచారించగా, అర్జున్ నిజాన్ని ఒప్పుకున్నాడు. అతని సమాచారం మేరకు ఇంటి వెనుక తవ్వకాలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ విషయాన్ని గోరఖ్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ శిల్పా కుమారి ధృవీకరించారు. వివాహేతర సంబంధంపై అనుమానంతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్న ఈ దంపతులకు సంతానం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: