హిందూపురం(AP Crime) పట్టణంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న వీరేశ (13) అనే బాలుడిని అతని అక్కను వివాహం చేసుకోవాలని కోరిన వ్యక్తి కుటుంబం నిరాకరించడంతో తీవ్రంగా కొట్టిన ఘటన చివరకు ప్రాణాంతకంగా మారింది.
Read Also: TG Crime: అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి
పోలీసుల కథనం ప్రకారం, కర్ణాటకకు చెందిన దొడ్డయ్య అనే వ్యక్తి బాలుడు(AP Crime) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి రోకలితో తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దొడ్డయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనను కలిగించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: