హైదరాబాద్ వాసులకు గోవా (Goa) అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు స్నేహితులతో కలిసి బీచ్ ట్రిప్ ప్లాన్ చేయడం సాధారణమే. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం ఎక్కువ సమయం తీసుకోవడం, రోడ్ల పరిస్థితి అంతగా అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రయాణం అలసటగా మారుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్–పానాజీ నేషనల్ హైవే ప్రాజెక్టును వేగవంతం చేసింది.
Read also: Breaking News: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా

Bharatmala Project
భారత్‌మాల పరియోజన కింద సుమారు రూ.12 వేల కోట్ల వ్యయంతో ఈ 4-లేన్ హైవేను నిర్మిస్తున్నారు. ఇది తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలను కలిపే కీలక ఎకనామిక్ కారిడార్‌గా మారనుంది. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో భూసేకరణ దాదాపు పూర్తై పనులు ఊపందుకున్నాయి. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు ఇవే
• మొత్తం 4-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మాణం
• రాయచూరు, బాగల్‌కోట్, బెల్గాం మీదుగా పానాజీకి కనెక్టివిటీ
• బాగల్‌కోట్ జిల్లాలో 102 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం
• ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 9 భారీ ఫ్లైఓవర్లు
• టూరిజంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు కూడా మేలు
• 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: