విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఆయుర్వేద పిజి డాక్టర్లు సర్జరీలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఆయుర్వేద (Ayurveda) డాక్టర్లు 58 రకాల సర్జరీలను చేయొచ్చు. 2020లో సిసిఐఎం (భారతీయ కేంద్ర వైద్య మండలి) ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఎపి అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆయుర్వేద పిజి కోర్సుల్లోనే వారికి శిక్షణ ఇస్తారు. 39 సాధారణ శస్త్ర చికిత్సలు (శల్యతంత్ర), 19 ఇతర విభాగాల శస్త్ర చికిత్సలు (శలాక్యతంత్ర) నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక, అర్హత సాధించిన వైద్యులు ఈ ఆపరేషన్లు చేయవచ్చు. ఎపి ప్రభుత్వం పురాతన భారతీయ వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానం చేసేదిశగా ఈనిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం ద్వారా, ఆయుర్వేద వైద్యులకు సర్జరీలు చేయడంలో ప్రక్రియలో శిక్షణ ఇచ్చి.. తగిన గుర్తింపుతో పాటు అనుమతి ఇవ్వనున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ విషయంపై అధికారులతో చర్చించారు. ఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే విడుదల చేసిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆయుర్వేద వైద్య రంగానికి ఒక ముఖ్యమైన ముందడుగు అన్నారు.
Read also: Chandrababu : చంద్రబాబువన్నీ చిల్లర రాజకీయాలే – కాకాణి కామెంట్స్

Andhra Pradesh
పిజి పూర్తి చేసిన విద్యార్థులు సర్జరీలు స్వతంత్రంగా నిర్వహించొచ్చు
కేంద్రం 2020లో ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చని.. ఆయుర్వేదంలో పిజి విద్యార్థులకు శస్త్రచికిత్సల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం పిజి ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ 2016 (ఆయుర్వేద విద్య) రెగ్యులేషన్ కు సవరణలు చేసి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పిజి పూర్తి చేసిన విద్యార్థులు సర్జరీలు స్వతంత్రంగా నిర్వహించొచ్చు. మంత్రిత్వశాఖ రూ.750 కోట్లతో ఒక ఆసుపత్రిని నిర్మించనుంది. ఎపి ప్రభుత్వం ఆయుష్ ఆప్పత్రి కోసం శాఖమూరు గ్రామంలో 23.127 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని ఏటా కేవలం ఒక రూపాయి లీజుతో 60 సంవత్సరాల పాటు కేటాయించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ చేపడుతోంది. దీని ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు AYUSH Doctors అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే, రాజధాని ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: