నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా చర్చలు, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ సినిమా స్టార్‌ల క్రేజ్‌ను కొలిచే ప్రధాన ప్రమాణంగా మారిపోయాయి. థియేటర్లలో కలెక్షన్లు ఎంత కీలకమో… ఆన్‌లైన్‌లో ఒక నటుడిపై ఎంతగా సెర్చ్ జరుగుతుందన్నదీ అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో 2025 (Google Search 2025) సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.
Read Also: Yash Raj Films: ‘వార్-2’ నష్టాలపై నాగవంశీ క్లారిటీ
టాప్ 5 మోస్ట్ సెర్చ్ జాబితా
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఏ హీరోపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపారనే ప్రశ్నకు సమాధానంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఈ నెల 24 నాటి గూగుల్ డేటా ప్రకారం, 2025లో గూగుల్‌లో అత్యధికంగా (Google Search 2025) వెతకిన టాలీవుడ్ నటుడిగా బన్నీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఆయనతో పాటు ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు టాప్ 5 మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అల్లు అర్జున్ తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యంగా ‘ పుష్ప 2 : ది రూల్’ సినిమా సాధించిన సంచలన విజయమే ఆయన్ని గూగుల్ సెర్చ్‌ల్లో అగ్రస్థానానికి చేర్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు, సోషల్ మీడియాలో నిరంతర చర్చలు, మీమ్స్, వీడియో క్లిప్స్, రీల్స్ రూపంలో ‘పుష్పరాజ్’ క్యారెక్టర్ దేశవ్యాప్తంగా వైరల్ కావడం అల్లు అర్జున్ క్రేజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, హిందీ బెల్ట్‌లోనూ ఆయన పేరు ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: