సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందని అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక ప్రకటన చేసింది. పండుగ సమయంలో స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే (SCR) నిర్ణయించింది.
Read Also: AP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ ప్రత్యేక సర్వీసులలో రెండు రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ – కాకినాడ మార్గంలో, మిగిలిన రెండు రైళ్లు మచిలీపట్నం – వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి.కాకినాడ – వికారాబాద్ రైలు (07450): ఇది జనవరి 19న కాకినాడ నుంచి సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్ – కాకినాడ రైలు (07451): ఈ రైలు జనవరి 20న వికారాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9:15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.

ప్రత్యేక సర్వీసులు
నాందేడ్ – కాకినాడ రైలు (07452): ఇది జనవరి 12న మధ్యాహ్నం 1:30 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07453) రైలు జనవరి 13న కాకినాడలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.మచిలీపట్నం – వికారాబాద్ రైలు (07454): ఈ రైలు జనవరి 11, 18 తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్ – మచిలీపట్నం రైలు (07455): జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8:15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: