ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. మహిళల సాధికారత దిశగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజాగా, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివ్యాంగులకు కూడా (AP) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని సంకల్పించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం దివ్యాంగులు 50 శాతం టికెట్ రాయితీతో ప్రయాణిస్తున్నారు. త్వరలో వీరికి ఎలాంటి రాయితీ లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కలగనుంది.
Read Also: AP: స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: