రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). మహేష్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మంచి రివ్యూలు, రేటింగులు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.
Read Also: Sandeep Reddy Vanga: సందీప్ కు ప్రభాస్ స్పెషల్ విషెస్..
ఈ నెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా (Andhra King Taluka) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇప్పటి దాకా స్టార్ బయోపిక్స్ చూశాం.. ఇప్పుడు ఒక ఫ్యాన్ బయోపిక్ చూసే టైమ్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి డిజిటల్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా… ఓ వీరాభిమాని జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన కథతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “థియేటర్లలో మిస్ అయ్యాం కానీ, ఓటీటీలో చూసాక చాలా నచ్చింది”, “2025లో వచ్చిన అండర్‌రేటెడ్ సినిమాల్లో ఇది ఒకటి” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: