
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ విజయంతోనే ఇప్పుడు తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొదటి పార్ట్ కంటే భారీ స్థాయిలో ‘జైలర్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నెల్సన్.
Read Also: Dhurandhar box office : 600 కోట్ల క్లబ్‌లో ధురంధర్.. వంగా రికార్డు బ్రేక్!
జైలర్ లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ యాక్టర్స్ క్యామియా రోల్స్ చేశారు. సీక్వెల్ లోనూ వీరిద్దరి పాత్రలు కొనసాగనున్నాయని సమాచారం. వీరితో పాటుగా పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కూడా రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని, ఆయన పవర్‌ఫుల్ రోల్ లో కనిపిస్తారని టాక్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి తాజాగా ధృవీకరించారు.
చిన్న సీన్ కోసం స్క్రీన్ పంచుకున్నారు
ఈ సినిమాలో నటీనటుల పేర్లను చెబుతూ.. “మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్” అని షారుఖ్ పేరును కూడా చేర్చారు. దీంతో ‘జైలర్ 2’లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)నటిస్తున్నారనే విషయం దాదాపు ఖరారైందని అభిమానులు సంబరపడుతున్నారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్ కలిసి గతంలో ‘రా వన్’ (Ra.One) సినిమాలో ఒక చిన్న సీన్ కోసం స్క్రీన్ పంచుకున్నారు.
ఇప్పుడు ఒక పూర్తి స్థాయి స్పెషల్ రోల్‌లో వీరు కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో రజనీకాంత్, మిథున్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు, దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: