భారత నేవీ బంగాళాఖాతంలో ఐఎన్ఎస్ అరిఘాత్ జలాంతర్గామి నుంచి కే-4 బాలిస్టిక్ మిసైల్ (K-4 Missile) ను గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అంతేకాకుండా రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఇది భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఘట్టంగా చరిత్రలో నిలవనుంది. ఇది దేశ న్యూక్లియర్ ట్రయాడ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి, అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది.
Read Also: PPP Approach : వైద్య రంగంలో PPPతోనే మేలు – నడ్డా లేఖ
గతేడాది ఆగస్టు 29న ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టిన ఈ క్షిపణి.. భారత్‌కు అత్యంత సుదూర లక్ష్యాలను చేధించగలిగే సముద్ర ఆధారిత వ్యూహాత్మక ఆయుధంగా నిలుస్తుంది. ఉపరితలం నుంచి ప్రయోగించే అగ్ని-III వెర్షన్‌ను సముద్రం జలాల నుంచి ప్రయోగానికి వీలుగా అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి జలాంతర్గామి నుంచి బయటకు వచ్చి, నీటి ఉపరితలంపైకి తేలి, ఆపై రాకెట్ మోటారును మండించి గాలిలోకి దూసుకుపోయేలా మార్పు చేశారు.

తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ
ఈ క్షిపణి 2.5 టన్నుల అణ్వాయుధాన్ని మోసుకెళ్లగలదు. అరిహింత్ శ్రేణి జలాంతర్గాముల నుంచి దీనిని ప్రయోగించవచ్చు.కే-4 క్షిపణి (K-4 Missile) , భారత అణ్వాయుధ త్రయం (nuclear triad)లో అత్యంత రహస్యమైనది. అరిహంత్-శ్రేణి జలాంతర్గాములు సుదీర్ఘకాలం పాటు సముద్ర అడుగున నిశ్శబ్దంగా ‘నిరోధక పెట్రోలింగ్’ (deterrence patrols) కోసం నిర్మించారు.
‘కే’ అనే అక్షరం, భారత్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) లో కీలక పాత్ర పోషించిన ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళిగా పెట్టారు.పూర్తి అణు సామర్థ్యంతో దేశీయ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’. ఇది 2018 నుంచి నేవీకి సేవలు అందిస్తోంది. దీని స్ఫూర్తి, డిజైన్, అనుభవంతో ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ను నిర్మించారు. భారత నౌకాదళంలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ చక్ర. దీనిని రష్యా నుంచి భారత్ లీజుకు తీసుకుంది. కానీ, 2011 డిసెంబరులో భారత్ సొంతంగా అణు జలాంతర్గాముల నిర్మాణాన్ని చేపట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: