Eesha Telugu movie : ఈషా అనే తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడే చిత్రంగా ప్రమోట్ చేశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టిందో చూద్దాం
నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంత్), కల్యాణ్ (అధిత్ అరుణ్), వినయ్ (అల్హిల్ రాజ్ ఉద్దెమారి) అనే నలుగురు స్నేహితులు అమాయక ప్రజలను మోసం చేసే నకిలీ బాబాలను బయటపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఆశ్రమం నడుపుతున్న ఆది దేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) అనే గాడ్‌మ్యాన్ గురించి తెలుసుకుంటారు. అతడు ఒకప్పుడు అమెరికాలో న్యూరాలజిస్ట్‌గా పని చేసి, ఇప్పుడు బాబాగా మారిన వ్యక్తి.
Read also: H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు
వారిని ఎదుర్కొన్న ఆది దేవ్, దయ్యాలు (Eesha Telugu movie) లేవని నిరూపించేందుకు ఒక సవాల్ విసురుతాడు. మూడు రాత్రులు ఒక పాడుబడిన భూతబంగ్లాలో గడిపితే, తాను చేస్తున్న మోసాలను ఆపేస్తానని చెబుతాడు. సవాల్‌ను స్వీకరించిన స్నేహితులు ఆ ఇంట్లోకి అడుగుపెడతారు. అక్కడ జరుగుతున్న విచిత్ర సంఘటనలు వారి నమ్మకాల్ని కుదిపేస్తాయి. అసలు ఆ ఇంట్లో ఏముంది? ‘ఈషా’ ఎవరు? అన్నదే కథలో కీలకం.
దర్శకుడు శ్రీనివాస్ మన్నె చివర్లో ఒక కొత్త ఆలోచనను హారర్ మార్గంలో చెప్పేందుకు ప్రయత్నించారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కొంతవరకు వర్క్ అవుతుంది. క్రిక్కిరిసే శబ్దాలు, అకస్మాత్తుగా వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో హారర్ ఫీల్‌ను కలిగిస్తాయి. క్లైమాక్స్‌లో ‘ఈషా’పై వచ్చే క్లారిటీ ఆసక్తికరంగా
ప్రమోషన్స్ వల్ల భారీ అంచనాలు ఏర్పడినా, సినిమా వాటిని అందుకోలేకపోయింది. కథ పూర్తిగా పాత తరహా హారర్ టెంప్లేట్లోనే సాగుతుంది. ముఖ్యంగా మొదటి భాగం నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతుంది. జంప్ స్కేర్స్, భయానక ముఖాలు, గట్టిగా వినిపించే సౌండ్స్‌పై ఎక్కువగా ఆధారపడటం వల్ల అసలైన భయం పుట్టదు. కథలో బలం లేకపోవడం ప్రధాన లోపం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: