భారత పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. (TG) హైదరాబాద్‌కు చెందిన సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 3.6 కోట్లు పెట్టుబడి పెట్టారు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 1.8 లక్షల షేర్లను కొనుగోలు చేసి 2 శాతం వాటాను దక్కించుకున్నారు. 2008లో స్థాపించబడిన ఈ సంస్థ సోలార్ ప్రాజెక్టులలో ప్రత్యేకత కలిగి ఉంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు కొత్తగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలోనూ విస్తరిస్తోంది.
Read Also: Sports: అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి తోడవడం
ఆ సంస్థ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చారుగుండ్ల భవానీ సురేశ్, సచిన్ పెట్టుబడి తమ సంస్థకు గర్వకారణమని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా 2030 నాటికి భారతదేశంలోని టాప్-3 సోలార్ EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) కంపెనీలలో ఒకటిగా ఎదగాలని ట్రూజన్ సోలార్ లక్ష్యంగా పెట్టుకుంది. సచిన్ టెండూల్కర్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి తోడవడంతో, బ్రాండ్ విలువ పెరగడమే కాకుండా దేశవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: