
బంగ్లాదేశ్(Bangladesh) రాజకీయ వేదికపై కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మాజీ నేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ 17 సంవత్సరాల స్వీయ బహిష్కరణ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. లండన్‌లో నివసిస్తూ రాజకీయాల నుంచి దూరంగా ఉన్న ఆయన, తల్లి ఖలీదా జియా ఆరోగ్య సమస్యలు మరియు దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌కు అడుగు పెట్టారు.
Read Also: Nitin Gadkari: హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా
తారిక్ రహమాన్ రాకకు ముంగిట, ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు గట్టిగానే నిర్వహించారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు అప్రమత్తంగా ఉండగా, విమానాశ్రయం పరిసర ప్రాంతాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు.
“సెకండ్ ఇన్నింగ్స్” : తారిక్ రహమాన్
తారిక్ రాకతో BNP శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు దీన్ని “తారిక్ రహమాన్ సెకండ్ ఇన్నింగ్స్”గా వ్యాఖ్యానించారు. స్వాగతానికి వేలాది మద్దతుదారులు విమానాశ్రయం వరకు మార్చ్ నిర్వహించగా, వీధులు పార్టీ జెండాలు, నినాదాలతో హోరెత్తాయి.
మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కుమారుడు తారిక్ రాక భావోద్వేగపరంగా కూడా ప్రాధాన్యత సంతరించింది. 2026లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ రాకకు రాజకీయ ప్రాధాన్యతను పెంచుతున్నాయి.
“డార్క్ ప్రిన్స్”గా పేరు పొందిన తారిక్…
స్వదేశానికి చేరుకున్న తారిక్ రహమాన్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రజలకు ప్రసంగించనున్నట్లు BNP వర్గాలు తెలిపారు. ఈ ప్రసంగంలో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై కీలక సంకేతాలు ఇవ్వబడ్డాయి అని అంచనాలు ఉన్నాయి. గతంలో ఆయనను ప్రత్యర్థులు “డార్క్ ప్రిన్స్”గా అభివర్ణించినప్పటికీ, అవినీతి ఆరోపణలు, రాజకీయ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు తారిక్ రాజకీయ కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు అని BNP నేతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: