దేశవ్యాప్తంగా త్వరలోనే ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా(AmitShah) ప్రకటించారు. ఈ సేవల ద్వారా వచ్చే లాభాలను పూర్తిగా డ్రైవర్లకే అందిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, డ్రైవర్ల ఆదాయం పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
Read Also: Tamil Nadu: రైల్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

హర్యానాలోని పంచకులలో నిర్వహించిన సహకార సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా(AmitShah) ఈ ప్రకటన చేశారు. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ‘భారత్ ట్యాక్సీ’ ద్వారా వచ్చే లాభాల్లో ఒక్క రూపాయి కూడా మధ్యవర్తులకు వెళ్లదని, మొత్తం డ్రైవర్లకే చేరుతుందని ఆయన వివరించారు. ఇది డ్రైవర్ వర్గానికి ఆర్థిక భద్రతను కల్పిస్తుందని చెప్పారు.
దేశ అభివృద్ధిలో హర్యానా పాత్రకు ప్రశంసలు
ఈ సందర్భంగా అమిత్ షా హర్యానా రాష్ట్రం దేశానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఆహార భద్రత, పాల ఉత్పత్తి, క్రీడారంగంలో హర్యానా కీలకంగా నిలుస్తోందన్నారు. పంజాబ్‌తో కలిసి దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా నిలబెట్టడంలో హర్యానా ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు.
రక్షణ రంగంలో హర్యానా విశిష్ట స్థానం
చిన్న రాష్ట్రం అయినప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర సాయుధ బలగాలు, త్రివిధ దళాలకు అత్యధిక సంఖ్యలో సైనికులను అందిస్తున్న రాష్ట్రం హర్యానా అని అమిత్ షా గుర్తు చేశారు. ఇది ఆ రాష్ట్ర ప్రజల దేశభక్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.
దేశంలో శ్రేయస్సు సాధించాలంటే పశుపోషణ, వ్యవసాయం, సహకార రంగాలను పరస్పరం అనుసంధానించాల్సిన అవసరం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ రూ. 22 వేల కోట్ల నుంచి రూ. 1.27 లక్షల కోట్లకు, గ్రామీణాభివృద్ధి బడ్జెట్ రూ. 80 వేల కోట్ల నుంచి రూ. 1.87 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: