టీమిండియా స్టార్ బ్యాటర్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో ఉంటే పరుగుల వర్షమే కాదు, వినోదం కూడా పుష్కలంగా ఉంటుంది. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేసి అభిమానులకు కనువిందు చేశాడు.
Read Also: Temba Bavuma: వారిద్దరూ నాకు సారీ చెప్పారు: బవుమా
ఈ మ్యాచ్‌లో సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది.రోహిత్ (Rohit Sharma) వీరవిహారంతో ఆ జట్టు కేవలం 30.3 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో 117 బంతులు మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి నినాదాలు
బీసీసీఐ సెలక్టర్ ఆర్పీ సింగ్‌ను గ్యాలరీలో చూసిన అభిమానులు, గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి నినాదాలు చేశారు. “గంభీర్ ఎక్కడున్నాడు? చూస్తున్నావా లేదా?” అంటూ గట్టిగా అరిచారు.రోహిత్ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు వారాంతం కానప్పటికీ, దాదాపు 20,000 మందికి పైగా అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.
ఉద్యోగులు, విద్యార్థులు తమ పనులను, క్లాసులను పక్కనపెట్టి హిట్‌మ్యాన్ బ్యాటింగ్ చూసేందుకు వచ్చారు. “ముంబై కా రాజా.. రోహిత్ శర్మ” నినాదాలతో స్టేడియం మార్మోగింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆశిష్ థాపా 79 పరుగులతో రాణించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: