Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్మస్ ఈవ్ సందర్భంగా డెమోక్రాట్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్లో సెలవులు గడుపుతున్న ట్రంప్, డెమోక్రాట్లను “దేశాన్ని నాశనం చేయాలనుకునే రాడికల్ లెఫ్ట్ స్కమ్”గా అభివర్ణించారు. క్రిస్మస్ శుభాకాంక్షల సందేశంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ మాట్లాడుతూ, తమ పాలనలో దేశంలో ఓపెన్ బోర్డర్స్ లేవని, చట్ట అమలు బలంగా ఉందని, మహిళల క్రీడల్లో పురుషుల పాల్గొనడం వంటి అంశాలకు తాము ముగింపు పలికామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ విధానాల వల్ల దేశ భద్రత మరింత బలపడిందని కూడా ఆయన అన్నారు.
Read also: H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు
అంతేకాదు, తన పాలనలో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో (Donald Trump) ఉందని, నేరాల రేటు గత దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తక్కువగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, జీడీపీ వృద్ధి 4.3 శాతానికి చేరిందని తెలిపారు. టారిఫ్ల వల్ల దేశానికి ట్రిలియన్ల డాలర్ల ఆదాయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై డెమోక్రాట్లు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజా ఆర్థిక గణాంకాలు జీడీపీ వృద్ధిని చూపించినప్పటికీ, దేశీయ ధరల సూచిక పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇది జీవన వ్యయంపై ప్రజల ఆందోళనలను పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: