हिन्दी | Epaper
22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Eesha Movie: ఈషా మూవీ రివ్యూ

Aanusha
Eesha Movie: ఈషా మూవీ రివ్యూ

త్రిగున్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంత్, బబ్లూ పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఈషా’ (Eesha Movie). హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరుస హిట్స్ కొడుతున్న బన్నీవాస్‌, వంశీ నందిపాటి ‘ఈషా’ సినిమా (Eesha Movie)ను డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ చేసారు.మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Read Also: Dhurandhar box office : పుష్ప-2 రికార్డులు బద్దలు.. ‘ధురంధర్’ సెన్సేషన్!

కథ

కళ్యాణ్ (త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), వినయ్ (అఖిల్ రాజ్), అపర్ణ (సిరి హనుమంతు) నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అందులో వినయ్, అపర్ణ పెళ్లి చేసుకుంటారు. నయనను కళ్యాణ్ ప్రేమిస్తుంటాడు. నలుగురు తమ ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో దొంగ బాబాలు, మూఢనమ్మకాల పేర్లతో మోసం చేస్తున్న వాళ్ల అసలు గుట్టు బయటపెడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అమెరికాలో మానసిక వైద్యుడిగా ఉండి, భార్య మరణం తర్వాత ఉన్నట్టుండి బాబా అవతారం ఎత్తిన ఆది దేవ్ (పృథ్వీ రాజ్) గురించి తెలుస్తుంది. అతడిని ఎక్స్ప్రెస్ చేయాలని నలుగురు వెళుతున్న టైం లో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత పుణ్యవతి (మైమ్ మధు) ఆ నలుగురిని వెంబడిస్తుంది. అప్పుడు ఏం జరిగింది.. వాళ్లకు పుణ్యవతికి ఏంటి సంబంధం అనేది అసలు కథ..

 Eesha Movie Review
Eesha Movie Review

విశ్లేషణ..

ఫస్ట్ హాఫ్ వీళ్ళు ఆది దేవ్ వద్దకు బయలుదేరే వరకు సింపుల్ గానే సాగిపోతుంది. మధ్యలో ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఓ ఫ్రెండ్షిప్ పాటతో సాగదీశారు. ఈ నలుగురు యాక్సిడెంట్ చేయడం, పుణ్యవతి ఆత్మ రావడం, వీళ్ళు ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్లడం అంతా కాస్త భయం భయంగా సాగుతుంది. ఇంటర్వెల్ కి ఒక్కసారిగా భయపెట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ ఇంట్లో ఏం జరిగింది అని సాగదీస్తూనే ఈ నలుగురు ఆది దేవ్ తో గొడవ పడుతూ బయట తిరుగుతూ కాస్త సాగదీసాడు అనిపిస్తుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి బాగానే భయపెట్టారు. చివర్లో ఉన్న ట్విస్ట్ బాగున్నా రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళు ఆ ట్విస్ట్ ని ముందే కనిపెట్టేస్తారు. చావులు, ఆత్మలు గురించి చెప్తూ హారర్ సినిమాగా ఈషాను తెరకెక్కించారు. సినిమా అంతా భయపెట్టకపోయినా కొన్ని సీన్స్ లో బాగానే భయపెట్టారు. కొన్ని సీన్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేస్తూ భయపెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870