బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి(Parthasarathy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులపై కేసీఆర్ మాట్లాడిన తీరు ఆక్షేపణీయమని విమర్శించారు. భాషపై పట్టు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడటం సరైంది కాదని స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోకి వస్తున్న పెట్టుబడులపై సందేహాలు ఉంటే వాటిని బహిరంగంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్‌కు పార్థసారథి సవాల్ విసిరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) లక్ష్యమని, ఈ విషయాన్ని ఆయన పలుమార్లు వెల్లడించారని గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన నష్టాల నుంచి అమరావతిని అభివృద్ధి చేస్తున్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: