Dhurandhar box office : ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. మూడో వారంలోనూ వసూళ్ల జోరు తగ్గకపోవడంతో ఈ చిత్రం మరో కీలక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఒక్క రోజులోనే ఈ సినిమా రూ.17.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.589.50 కోట్లకు చేరాయి.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ మూడో వారం రికార్డును ‘ధురంధర్’ అధిగమించడం విశేషం. ‘పుష్ప 2’ మూడో వారం మొత్తం మీద రూ.103 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ‘ధురంధర్’ మూడో వారం తొలి నాలుగు రోజుల్లోనే రూ.111.75 కోట్లు కొల్లగొట్టి కొత్త రికార్డు నెలకొల్పింది.
Read Also: Phone Hack: ట్రాఫిక్ చలాన్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా? మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు!
అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.876.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్–1’ (రూ.852.31 కోట్లు) రికార్డును బద్దలుకొట్టింది. దీంతో 2025లో అత్యధిక (Dhurandhar box office) వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. రూ.900 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే దిశగా ఈ సినిమా వేగంగా దూసుకెళ్తోంది.
మొదటి వారం రూ.207.25 కోట్లు, రెండో వారం రూ.253.25 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, మూడో వారం స్వల్ప తగ్గుదల తర్వాత మళ్లీ పుంజుకుంది. మంగళవారం నాటికి థియేటర్లలో ఆక్యుపెన్సీ 35.88 శాతంకు పెరగడం గమనార్హం.
అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా, పాకిస్థాన్‌లోని లియారి బలోచ్ గ్యాంగ్‌లోకి చొరబడే భారతీయ ఏజెంట్ ‘హంజా’ కథ చుట్టూ సాగుతుంది. ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతలు ఇప్పటికే ‘ధురంధర్ 2’ ను ప్రకటించారు. ఈ సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: