South Asia Security: భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, భారత్ పై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఇటీవల, రాడికల్ ఇస్లామిస్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత, బంగ్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దైవదూషణ ఆరోపణలతో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాసున్ను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ పై భారత్ దాడి చేస్తే సైనిక ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ పాలక ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ ఒక వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు. ఢాకా పై న్యూఢిల్లీ ఏదైనా చర్య తీసుకుంటే, పాకిస్తాన్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు.
Read also: Earthquake: తైవాన్లో భూకంపం: ప్రజల్లో భయాందోళన

South Asia Security
చర్చిల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.
బంగ్లాదేశ్. సార్వభౌమత్వంపై భారత్ దాడి చేస్తే, ఎవరైనా బంగ్లాదేశ్ వైపు చెడు దృష్టి పెట్టడానికి ధైర్యం చేస్తే, పాకిస్తాన్ ప్రజలు, పాక్ సైన్యం, పాక్ క్షిపణులు చాలా దూరంలో లేవని గుర్తుంచుకోండి అంటూ భారత్ ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో భారత్ చేస్తున్నకుట్రల పట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఉస్మాన్ పేర్కొన్నారు. అఖండ భారత్ భావజాలాన్ని బంగ్లాదేశ్ పై రుద్దే ప్రయత్నాన్ని పాక్ ప్రతిఘటిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం రాజధాని ఢాకా సహా కీలక నగరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించింది. క్రిస్మస్ వేడుకలు జరుపుకునే చర్చిల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, అంతర్గత భద్రతపై నమ్మకం లేకపోవడంతో విదేశీ రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: