మయన్మార్ (Myanmar) సైనికాధికారులు ఆదివారం నుంచి ఓటింగ్ కు అధ్యక్షత వహించనున్నారు. గత ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి ఐదు సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలోకి తిరిగి వచ్చినట్లు జుంటా సైన్యం ప్రకటించింది. ఫిబ్రవరి 2021లో జుంటా సైనికులు దేశం దశాబ్ద కాలంగా కొనసాగిన ప్రజాస్వామ్యాన్ని పడగొట్టి, ప్రభుత్వాన్ని చేజికి బహిష్కరించుకుంది. అంతేకాక ఆ దేశ మాజీ ప్రధాని ఆంగ్ సాన్ సూకీని జైల్లోనే నిర్భందంలో ఉంచారు. అంతటితో ఆగకుండా ఎన్నికల్లో ఆమె పార్టీని రద్దు చేసింది. ఆమె ఎన్నికల్లో నిలబడకుండా జుంటా సైన్యం నిర్భందం చేసింది. అంగ్ సాన్ సూకీ నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, ఆమెకు ప్రపంచదేశాల మద్దతు చాలానే ఉంది. అయినా జుంటా సైన్యం దేన్నీ ఖాతరు చేయకుండా, ఆమెపై తమ ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. జుంటా నియంత్రణలో ఉన్న భూభాగంలో, మూడు రౌండ్ల ఓటింగ్ మొదటి విడత ఆదివారం ఉదయం జరగనున్నది.
Read also: Bangladesh:యూనస్ మెడకు చుట్టుకుంటున్న హాదీ హత్య కేసు

Aung San Suu Kyi
మిలటరీ పాలనలో నలిగిపోతున్న మయన్మార్
సైన్యం బలవంతంగా తాము తీసుకున్న అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని స్థానికులు కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఎవరూ ఆసక్తి చూపడం లేదని, భద్రతాకారణాల దృష్ట్యా ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ప్రజలు వాపోతున్నారు. జుంటా ప్రభుత్వం ఓటర్లను మభ్యపెట్టి, అవినీతి ఆరోపిస్తూ వమిన్ ఆంగ్ హైంగ్ తిరుగుబాటును తన అధికారంలోకి తీసుకున్నారు. అవినీతి, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన నేరం కింద 27 సంవత్సరాలుగా సూకీ జైలు జీవితాన్నే అనుభవిస్తున్నారు. ప్రపంచదేశాలు ఆమెను విడుదల చేయాలని, మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి ఎన్ని విజ్ఞపులు చేసినా జుంటా సైన్యం ఖాతరు చేయలేదు. దీంతో పలు ధనిక దేశాలు మయన్మార్ కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా ఆపేశాయి. అయినా సైన్యం దేనికి బెదరకుండా, మొండిగా పాలిస్తున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: