ఈకాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఇటీవల కాలంలో ప్రేమించిన వారే హతమారుస్తున్నారు. నమ్మించి గొంతుకొస్తున్నారు. స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా ఇదే తంతు జరుగుతున్నది. తాజాగా కెనడాలో నివసిస్తున్న భారతీయ(Indian) మహిళ దారుణ హత్యకు గురయ్యారు. టొరంటో నగరంలో జరిగిన ఈ ఘటనలో ఆమె సన్నిహిత భాగస్వామియే ప్రధాన నిందితుడు అని పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతం ప్రవాస భారతీయుల్లో పెను విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం టొరంటోలోని (Canada Crime) స్ట్రాచన్ అవెన్యూ, వెల్లింగ్టన్ స్ట్రీట్ ఏరియాలో నివసిస్తున్న 30 ఏళ్ల హమాని శుక్రవారం నుంచి కనిపించడం లేందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. రాత్రి 10.40 గంటల సమయంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు మరుసటి రోజు శనివవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఒక నివాసంలో ఆమె విగతజీవిగా కనిపించింది. ఆమె మరణాన్ని ప్రాథమికంగా హత్యగా గుర్తించిన పోలీసులు వెంటనే హోమిసైడ్ యూనిట్ కు కేసును బదిలీ చేశారు.
Read Also: Venezuela US blockade law : అమెరికా మద్దతుదారులపై వెనిజులా కఠిన చట్టం!

ప్రేమికుడే హతమార్చాడా?
ఈ దారుణ(Canada Crime) హత్యకు పాల్పడింది ఆమెతో సన్నిహత సంబంధం కలిగి ఉన్న 32 ఏళ్ల అబ్దుల్ గపూరీ అని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అతడిని అరెస్టు చేసేందుకు కెనడా వ్యాప్తంగా రెడ్ కార్నర్ వారెంట్ జారీ చేశారు. అంతేకాక నిందితుడి ఫొటోలను కూడా విడుదల చేశారు. కాగా హిమాన్షి ఖురానా హత్యపై టొరంటోలోని భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: