గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల ధర పెంపుపై చాలా రాద్దాంతం జరుగుతోంది. టికెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు కోరుతుంటే, ప్రేక్షకులు మాత్రం టికెట్ల ధరలు తగ్గించాలని కోరుతున్నారు. టికెట్ల ధరలు పెంచితే, ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టగొడుగుల లాగా వస్తారని మరి కొంతమంది వాదిస్తున్నారు.ఏపీ సినీ పరిశ్రమ సమస్యలపై తాజాగా జరిగిన కీలక సమావేశం తర్వాత దర్శకుడు తేజ (Teja) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also: Pragati: వేణు స్వామికి కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి

టికెట్ ధర కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులతో జరిగిన భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ (Teja), థియేటర్లలో ఉన్న పరిస్థితులపై ఆసక్తికరమైన, వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధర కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ ఉందన్నారు.
మేకర్స్, థియేటర్ ఓనర్స్‌కు నష్టం జరగకుండా ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేలా టికెట్ ధరలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల వల్ల చిన్న సినిమాలకు ఇబ్బందని, అవి పాన్ ఇండియా సినిమాలైతే ఇవి పెయిన్ ఇండియా సినిమాలని వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: