కాంగ్రెస్(Congress) పార్టీలో ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చే అంశంపై జరుగుతున్న చర్చలకు బీజేపీ తీవ్రంగా(Priyanka Gandhi) స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన దిశ లేదని, ఎప్పుడూ అంతర్గత అయోమయంలోనే ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా విమర్శించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు బదులు “ఐ నీడ్ కన్ఫ్యూజన్” అనే పేరు ఆ పార్టీకి బాగా సరిపోతుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పార్టీ లోపల జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వర్గపోరులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Read Also: Mumbai elections: ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి ముంబై ఎన్నికలో పోటీ

రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌లో వర్గ రాజకీయాలు
రాజస్థాన్‌లో సచిన్ పైలట్–అశోక్ గెహ్లాట్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతిభా సింగ్–సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటకలో డీకే శివకుమార్–సిద్ధరామయ్య మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పూనవాలా తెలిపారు. ఇదే పరిస్థితి ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోందని, పార్టీ రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గంగా విడిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల ప్రకటనలు రాహుల్ గాంధీ నాయకత్వంపై విశ్వాసం లేనట్టుగా సంకేతాలు ఇస్తున్నాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో శశి థరూర్ రాహుల్ గాంధీ అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడడం, ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రియాంక గాంధీని ప్రధానమంత్రిగా ప్రతిపాదించి తర్వాత వివరణ ఇవ్వడం ఇందుకు ఉదాహరణలని పూనవాలా చెప్పారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మహమ్మద్ మోక్విమ్ కూడా రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రియాంక గాంధీకి పెద్ద పాత్ర ఇవ్వాలని ఆయన సూచించినట్టు తెలిపారు. ఈ అంశంపై రాబర్ట్ వాద్రా కూడా స్పందించడాన్ని ప్రస్తావిస్తూ, ఇది కాంగ్రెస్‌లోని కుటుంబ రాజకీయాలను బయటపెడుతోందని విమర్శించారు.
ఇదే అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, ఇతర పార్టీల్లో కుటుంబ విభేదాలు ఉన్నట్లే కాంగ్రెస్‌లోనూ రాహుల్–ప్రియాంక మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి కావాలని కలలు కనే హక్కు అందరికీ ఉంటుందని, బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ప్రధాని కావచ్చని అన్నారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం ఒకే కుటుంబ రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: