हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Pragati: వేణు స్వామికి కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి

Anusha
Pragati: వేణు స్వామికి కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి ప్రగతి (Pragati), ఇటీవల టర్కీలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో ఆమె ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మొత్తంగా నాలుగు మెడల్స్ గెలుచుకోవడం ద్వారా, ఒకప్పుడు తన వయస్సు గురించి, ఫిట్‌నెస్ గురించి విమర్శలు చేసిన వారికి తన ప్రతిభతో సమాధానం చెప్పారు.

Read Also: Vikranth: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’

కఠిన సాధన, నిరంతర కృషి వల్లే ఈ విజయం

ఈ ఘన విజయం తర్వాత, ప్రగతి చుట్టూ ఓ వివాదం చోటుచేసుకుంది. ప్రగతి సాధించిన మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, వ్యాఖ్యలకు ప్రగతి (Pragati)గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పూజల వల్లే తాను విజయం సాధించానని వేణుస్వామి చెప్పడం సరికాదని ప్రగతి అన్నారు.

Actress Pragati counters Venu Swamy
Actress Pragati counters Venu Swamy

కఠిన సాధన, నిరంతర కృషి వల్లే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని చెప్పారు. వేణుస్వామి వద్ద రెండున్నరేళ్ల క్రితం తాను పూజలు చేయించుకున్న విషయం నిజమేనని.. అయితే, తాను మానసికంగా కష్టమైన దశలో ఉన్నప్పుడు ఆ పూజలు చేయించుకున్నానని తెలిపారు. తన స్నేహితుల సూచనతోనే తాను ఆయన వద్దకు వెళ్లానని.. టైమ్ బాగోలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం సహజమేనని చెప్పారు.

కానీ ఆ పూజల వల్ల తన జీవితంలో గానీ, క్రీడల్లో గానీ ఎలాంటి ప్రత్యక్ష ఫలితం కనిపించలేదని స్పష్టంగా చెప్పారు.ఎప్పుడో జరిగిన పూజలకు, ఇప్పుడు తాను సాధించిన విజయానికి ముడిపెడుతూ.. తన విజయానికి ఆ పూజలే కారణమన్నట్టుగా చెప్పుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. తన విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870