మహారాష్ట్ర(Maharashtra) రాజకీయ రంగంలో ప్రాధాన్యత గల పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఇరవై ఏళ్ల విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ భేటీ అయ్యారు. (Mumbai elections) రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కలిసి బరిలోకి దిగనున్నట్లు ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ముంబైకి తప్పకుండా మరాఠీ మేయర్ వస్తాడని రాజ్ ఠాక్రే పేర్కొనగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముంబైపై తమ పట్టు కొనసాగుతుందని ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Nitin Gadkari : ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణం : నితిన్ గడ్కరీ

బీఎంసీతో పాటు 28 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 15న బీఎంసీతో పాటు మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. (Mumbai elections) అదే రోజు 32 జిల్లా పరిషత్తులు, 336 పంచాయతీ సమితులకూ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ కీలక ఎన్నికల నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేయాలనే నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పొత్తును శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చారిత్రాత్మక ఆరంభంగా అభివర్ణించారు. బీజేపీతో పాటు ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనపై అసంతృప్తిగా ఉన్న నేతలు తమతో చేరవచ్చని పిలుపునిచ్చారు. 2005లో విడిపోయిన ఉద్ధవ్–రాజ్ ఠాక్రేలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ కలయికకు దారితీసింది. మరోవైపు, ఈ పొత్తుపై బీజేపీ విమర్శలు చేసింది. ఈ కూటమి రాజకీయంగా ఓటమికి దారి తీస్తుందని, గతంలో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, శరద్ పవార్‌లతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: