కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్తలు అందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Read Also: Online Shopping: ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ

తిరుపతిలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 26 నుంచి తిరుపతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల ప్రత్యేక ఎగ్జిబిషన్(Handloom Exhibition) నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్లో చేనేత జౌళి శాఖ ద్వారా తక్కువ ధరలకే వస్త్రాలు విక్రయించనున్నారు. ఈ కార్యక్రమంలో 40 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్‌తో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంటాయని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్‌ను చేనేత జౌళి శాఖ పర్యవేక్షించనుంది.
మంగళగిరి, గుంటూరులో ప్రత్యేక కౌంటర్లు
తిరుపతితో పాటు మంగళగిరి, గుంటూరులో కూడా ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కౌంటర్లలో 60 శాతం వరకు తగ్గింపుతో చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. మంగళగిరిలో యర్రబాలెం ప్రాంతంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనుండగా, విజయవాడలోని ఆప్కో షోరూమ్‌లో చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఇతర ఆప్కో షోరూమ్‌లలో(Handloom Exhibition) కొనుగోలు చేసే వారికి 40 శాతం తగ్గింపు వర్తించనుంది. అలాగే మహిళా సంఘాల ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఖాదీ క్లస్టర్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలు
రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయనున్నారు. నిరుద్యోగ మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం పనులు, టైలరింగ్ వంటి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా ప్లేట్లు, కొవ్వొత్తుల తయారీ వంటి కార్యకలాపాల్లో నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించనున్నారు. ఇప్పటికే మంజూరైన యూనిట్ల లబ్ధిదారులతో త్వరలో సమావేశాలు నిర్వహించి, మరింత మంది ఈ అవకాశాలను వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: