పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందిన ఎక్సైజ్ బిల్లు–2025 (Central Excise Amendment Bill, 2025) ద్వారా సిగరెట్లు, బీడీలు, గుట్కా సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావంతో త్వరలోనే మార్కెట్లో ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటికే ధరల భారంతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇది మరో అదనపు భారంగా మారనుంది.జీఎస్టీ సెస్ (GST Compensation Cess) ముగియనున్న తరుణంలో ఆ లోటును భర్తీ చేస్తూ ఎక్సైజ్ సుంకాన్ని పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది.
Read Also: Mumbai elections: ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి ముంబై ఎన్నికలో పోటీ
ఎక్సైజ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం కొత్తగా అదనపు పన్ను విధించడంలేదని, ప్రస్తుతం ఉన్న పన్ను భారాన్ని యథాతథంగా కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రాలకు జరిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రూ. 2.69 లక్షల కోట్ల రుణాన్ని చెల్లించడానికి ప్రస్తుతం పొగాకుపై సెస్ విధిస్తున్నారు.
ఈ రుణం మరికొన్ని వారాల్లో తీరిపోనుంది. ఆ తర్వాత సెస్ నిలిచిపోతుంది. సెస్ పోతే పొగాకు ఉత్పత్తులు చౌకైపోతాయని.. తద్వారా ప్రజారోగ్యం దెబ్బతింటుందని భావించిన ప్రభుత్వం.. సెస్ స్థానంలో ఎక్సైజ్ సుంకాన్ని (Central Excise Duty) తిరిగి ప్రవేశపెడుతోంది. సిగరెట్లు (Cigarettes): పొడవు, ఫిల్టర్‌ను బట్టి 1,000 స్టిక్స్‌కు రూ.2,700 నుండి రూ.11,000 వరకు పన్ను విధించనున్నారు. నమలే పొగాకు (Chewing Tobacco): కేజీకి రూ.100 చొప్పున పన్ను ఉంటుంది. ముడి పొగాకు: దీనిపై ఏకంగా 60-70% వరకుఎక్సైజ్ సుంకం విధించే ప్రతిపాదన ఉంది.

సిగరెట్ స్టిక్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 18
సిగరెట్లు (Cigarettes): పొడవు, ఫిల్టర్‌ను బట్టి 1,000 స్టిక్స్‌కు రూ.2,700 నుండి రూ.11,000 వరకు పన్ను విధించనున్నారు. నమలే పొగాకు (Chewing Tobacco): కేజీకి రూ.100 చొప్పున పన్ను ఉంటుంది. ముడి పొగాకు: దీనిపై ఏకంగా 60-70% వరకు ఎక్సైజ్ సుంకం విధించే ప్రతిపాదన ఉంది. సాధారణంగా ఒక సిగరెట్ స్టిక్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 18 నుండి రూ. 20 వరకు ఉంది. ప్రభుత్వం డెమెరిట్ కేటగిరీ కింద 40% జీఎస్టీని కొనసాగిస్తూనే..
సెస్ స్థానంలో భారీ ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం పొగాకు ధరలు ప్రజలకు అందుబాటులో ఉండకూడదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పన్నును గరిష్ట స్థాయిలో ఉంచనుంది. దీనివల్ల ప్రస్తుతం రూ. 18 ఉన్న సిగరెట్ ధర వచ్చే ఏడాది నాటికి రూ. 22 నుండి రూ. 25 వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఒక్కో స్టిక్‌పై రూ. 4 నుండి రూ. 7 వరకు పెరిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: